తాత పాత్రలో చేయడానికి మళ్లీ నో చెప్పిన ఎన్టీఆర్
Add ap7am to your home Screen

తాత పాత్రలో చేయడానికి మళ్లీ నో చెప్పిన ఎన్టీఆర్

  • తమిళంలో రూపొందుతున్న 'తలైవి'
  • ప్రధానపాత్రధారిగా కంగనా రనౌత్ 
  • ఎన్టీఆర్ ను సంప్రదించిన యూనిట్
తెలుగు స్టార్ హీరోలలో ఎన్టీఆర్ స్థానం ప్రత్యేకం. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభించిన హీరోగా ఆయన కనిపిస్తాడు. అలాంటి ఎన్టీఆర్ కి 'మహానటి' సినిమాలో తన తాత నందమూరి తారకరామారావు పాత్రను పోషించవలసి వచ్చింది. వైజయంతి మూవీస్ వారితో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఆ ఆఫర్ ను ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించాడు.

తాజాగా మరోసారి ఆయన ఇదే తరహా ఆఫర్ కి నో చెప్పినట్టుగా సమాచారం. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా తమిళంలో 'తలైవి' పేరుతో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రధారిగా కనిపించనుంది. తెలుగులో ఎన్టీ రామారావుతోను జయలలిత నటించారు. అందువలన ఆయన పాత్ర కోసం ఎన్టీఆర్ ను అడిగారట. అయితే ఈ ఆఫర్ ను కూడా ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
Ntr

More Telugu News