మా ఇద్దరిదీ 40 ఏళ్ల అనుబంధం... ఇద్దరం కలిస్తే అనుకున్నది సాధించగలం: కమలహాసన్
- తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!
- కలిసిరావాలంటూ రజనీకాంత్ కు కమల్ పిలుపు
- సానుకూలంగా స్పందించిన రజనీ
కమలహాసన్ మాట్లాడుతూ, రజనీకాంత్ తమతో కలిసివస్తే తమిళనాడు ప్రజలకు అద్భుతమైన రీతిలో సంక్షేమం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. తామిద్దరిది 40 ఏళ్ల అనుబంధమని, తామిద్దరం కలిస్తే తాము ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చామో అది తప్పక సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై మీడియా రజనీని అడగ్గా, తాను కమల్ తో కలిసేందుకు సిద్ధమేనని అన్నారు. దీనిపై కమల్ కూడా హర్షం వ్యక్తం చేశారు.