రాహుల్ తో వున్నది ఫ్రెండ్షిప్ మాత్రమే: పునర్నవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ తో వున్నది ఫ్రెండ్షిప్ మాత్రమే: పునర్నవి

  • మేమంతా మంచి స్నేహితులం
  • టీమ్ లో అందరితో చనువుగా ఉండేదానిని  
  • అందువల్లనే అలా అనుకున్నారన్న పునర్నవి
'బిగ్ బాస్ 3' హౌస్ లో రాహుల్ - పునర్నవికి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు .. కొన్ని సంఘటనలు చూసినవారు, ఈ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని భావించారు. ఈ షో పూర్తయిన తరువాత బయట కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. 'ఈ టాక్ పై ఏమంటారు?' అనే ప్రశ్న వాళ్లకి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆలీ నుంచి ఎదురైంది.

అప్పుడు పునర్నవి స్పందిస్తూ .. "బిగ్ బాస్ హౌస్ లో 15 మంది ఉండటంతో .. ఎవరికి కంఫర్ట్ గా వున్న టీమ్ లోకి వాళ్లు వెళ్లారు. అలా మా టీమ్ లో నేను .. రాహుల్ .. వితిక .. వరుణ్ సందేశ్ ఉండేవాళ్లం. మేమంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. వరుణ్ - వితిక భార్యాభర్తలు. ఇక మిగిలింది రాహుల్ .. ఆయనతో నేను కొన్ని ఎమోషన్స్ ను షేర్ చేసుకోవడం వలన అలా అనుకుని వుంటారు. కానీ మా మధ్య వున్నది కేవలం స్నేహం మాత్రమే" అని చెప్పుకొచ్చింది. ఆ పక్కనే వున్న రాహుల్ కూడా అదే విధమైన సమాధానం ఇచ్చాడు.
Punarnavi
Rahul

More Telugu News