Anjali Devi: అప్పట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అంజలీదేవి ముఖం కొంతవరకూ కాలిపోయిందట

షార్ట్స్‌లో చూడండి
ఒకానొక సందర్భంలో మహానటి సావిత్రి మాట్లాడుతూ, సినిమాల్లోకి రావడానికి తనకి ఆసక్తి కలగడానికి కారణం అంజలీదేవి అని చెప్పారు. ఆమె నటన .. డాన్స్ చూసిన తరువాతనే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అంజలీదేవిని గురించి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.

"తెలుగు .. తమిళ భాషల్లో అంజలీదేవి కెరియర్ ఊపందుకుంటున్న రోజులవి. ఒక తమిళ సినిమాలో ఆమె మంటల్లో చిక్కుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ప్లానింగులో తేడా రావడంతో నిజంగానే ఆమె ఆ మంటల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమె ముఖం కొంతవరకూ కాలిపోయింది. ఇక అంజలీదేవి కెరియర్ ముగిసినట్టే అనే గుసగుసలు మొదలయ్యాయి. కానీ విదేశాల నుంచి వైద్యులను రప్పించి .. మందులు తెప్పించి మూడు నెలల పాటు చికిత్స చేయిస్తూ రావడం వలన తిరిగి ఆమె మామూలు మనిషి అయ్యారు. ఒక రకంగా ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక మరిచిపోలేని మలుపు అనే అనాలి" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Anjali Devi

More Telugu News