తిరుమల సిబ్బంది నిర్లక్ష్యం.. లడ్డూలో వెంట్రుకలు

  • ఇటీవల తిరుమల వెళ్లిన హైదరాబాద్ భక్తులు
  • ఇంటికి వచ్చాక లడ్డూను చూసి షాక్
  • ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది మరొక ఉదాహరణ. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు, దారాలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భక్తులు ఇటీవల తిరుమల వెళ్లి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చాక లడ్డూలో వెంట్రుకలు, దారాలను చూసి వారు అవాక్కయ్యారు. ఈ విషయం నలుగురికీ పొక్కడంతో, భక్తులంతా తిరుమల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా లడ్డూలో మేకులు, తదితర వస్తువులు రావడం అందరికీ తెలిసిన విషయమే.
Go Back to Shorts
Tirumala
Laddu
Hair

More Telugu News