'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' నుంచి ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసిన వర్మ
- బాలల దినోత్సవం సందర్భంగా పోస్టర్
- దేవాన్ష్ ను కూడా వదలని వర్మ
- తాత, తండ్రితో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు పోస్టర్
చంద్రబాబు, నారా లోకేశ్ తో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు ఉన్న ఈ పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా వర్మ విడుదల చేశారు. ఈ సినిమాలోని పలు పోస్టర్ లను ఇప్పటికే వర్మ విడుదల చేశారు. ఈ సినిమాకు ట్రైలర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు వాటి ద్వారా తెలిసింది.