విజయవాడ - ముంబై స్పైస్ జెట్ విమానం డైలీ సర్వీస్ రద్దు!
- 85 శాతం వరకూ ఆక్యుపెన్సీ
- అయినా రద్దు చేయడంపై విమర్శలు
- ఇక వారంలో మూడు రోజులు మాత్రమే ముంబైకి డైరెక్ట్ ఫ్లయిట్
వాస్తవానికి పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, జెట్ ఎయిర్ వేస్, పలు నగరాలకు సర్వీసులను రద్దు చేయగా, విజయవాడ - ముంబై స్లాట్ ఆ సంస్థకు లభించింది. 140 సీట్లు ఉన్న విమానాన్ని సంస్థ నడపగా, రోజూ 100 మందికి పైగానే ప్రయాణికులు దీనిలో ప్రయాణించేవారు. మంచి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, ఇలా విమాన సర్వీసును రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక రద్దయిన సర్వీసును రాజ్ కోట్ కు కేటాయించినట్టు స్పైస్ జెట్ వెల్లడించింది.