పరువు తీసిన టిక్‌టాక్‌ వీడియో.. అవమానభారంతో కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్న రాజోలు యువకుడు!

  • ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లిన యువకుడు
  • చిట్టీ డబ్బులతో కనిపించకుండా పోయాడంటూ స్నేహితుల వీడియో
  • మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్న మోహన్‌కుమార్
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో తనపై తప్పుడు వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్‌లో ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్‌కుమార్ (30) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ దుకాణంలో పనికి కుదిరాడు. సంపాదించిన సొమ్ములో కొంత చిట్టీ కడుతున్నాడు. ఇటీవల ఆ చిట్టీని పాడుకున్నాడు.

అయితే, చిట్టీ పాడుకున్న మోహన్ ఆ డబ్బు తీసుకుని కనిపించకుండా పోయాడంటూ అతడి స్నేహితులు కొందరు మోహన్ ఫొటోలతో ఓ వీడియో తయారుచేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. అది చూసి తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్ ఈ నెల 3న తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ మృతదేహం నిన్న స్వగ్రామం చేరుకుంది. మోహన్ ఆత్మహత్యపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
East Godavari District
kuwait
tiktok
suicide

More Telugu News