కాకినాడలో వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల వివాదం!
- సైకిల్ కు గాలి కొట్టించుకున్న సువర్ణరాజు
- రెండు రూపాయలు అడగటంతో గొడవ
- సువర్ణరాజును కత్తితో పొడిచిన షాపు యజమాని స్నేహితుడు
సైకిల్ కు గాలి కొట్టిన తరవాత రెండు రూపాయలు ఇవ్వాలని సాంబ కోరడంతో వివాదం మొదలైంది. తనను డబ్బులు అడుగుతావా? అంటూ సువర్ణరాజు సాంబపై దాడికి దిగడంతో, అదే దారిలో వస్తున్న సాంబ మిత్రుడు అప్పారావు, కల్పించుకుని సువర్ణరాజును కత్తితో పొడిచాడు. దీన్ని గమనించిన స్థానికులు సువర్ణరాజును కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.