అయోధ్య తీర్పు... యూపీలో పరిస్థితి ప్రశాంతం!: డీజీపీ ఓపీ సింగ్
- ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉన్నామని వెల్లడి
- అత్యవసర ఆపరేషన్ కేంద్రం(ఈవోసీ)ను ఏర్పాటు చేశామన్న డీజీపీ
- పరిస్థితిని సమీక్షించిన సీఎం
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయన్న ముందస్తు సమాచారంమేరకు తొలిసారిగా అత్యవసర ఆపరేషన్ కేంద్రం(ఈవోసీ)ను ఏర్పాటు చేసినట్లు సింగ్ తెలిపారు. ఈ కేంద్రంలో సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, ఎస్ ఎస్ బీ, ఐటీబీపీ, సీఐఎస్ ఎఫ్, జీఆర్పీ బలగాలు అవిశ్రాంతంగా పనిచేస్తుంటాయన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఏర్పాట్లను సమీక్షించారన్నారు. ఇప్పటివరకు అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు.