Sensex: కొనసాగిన లాభాలు.. 12 వేల మార్క్ కు చేరిన నిఫ్టీ

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. జూన్ 4వ తేదీ తర్వాత నిఫ్టీ మరోసారి 12వేల మార్క్ ను టచ్ చేసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 40,654కు పెరిగింది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.02%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.88%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.86%), ఐటీసీ (1.78%), వేదాంత లిమిటెడ్ (1.74%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.27%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.93%), ఓఎన్జీసీ (-1.69%), యాక్సిస్ బ్యాంక్ (-1.67%), టాటా మోటార్స్ (-1.66%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News