50 గుడ్లు తింటానని పందెం.. 42వ గుడ్డు తింటూ ప్రాణాలు కోల్పోయిన వైనం!

  • 50 గుడ్లు తిని మద్యం తాగితే రూ. 2 వేలు ఇస్తామని పందెం
  • 42వ గుడ్డు తింటుండగా అస్వస్థతకు గురై కుప్పకూలిన వైనం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
స్నేహితుల మధ్య సరదాగా మొదలైన పందెం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. రూ. 50 గుడ్లు తింటే రూ. 2 వేలు  ఇస్తానన్న పందేనికి ఒప్పుకున్న మరో వ్యక్తి 42వ గుడ్డు తింటూ ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌, జాన్‌పూర్‌లోని బీబీగంజ్‌ బజార్‌లో జరిగిందీ ఘటన.

సుభాష్ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితులతో మాట్లాడుతుండగా ఎవరు ఎన్ని గుడ్లు తినగలరన్న చర్చ వచ్చింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. 50 గుడ్లు తిని బాటిల్ మద్యం తాగిన వారికి రూ. 2 వేలు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించారు.

స్నేహితుల సవాలుకు సుభాష్ ముందుకొచ్చాడు. ఈ క్రమంలో 41 గుడ్లను అవలీలగా తినేశాడు. 42వ గుడ్డు తింటుండగా అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుభాష్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు.
Go Back to Shorts
Eggs
bet
Uttar Pradesh

More Telugu News