వాళ్లు చాలా అమాయకులు, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతున్నారు: జొన్నవిత్తుల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాళ్లు చాలా అమాయకులు, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతున్నారు: జొన్నవిత్తుల

  • వర్మతో జొన్నవిత్తుల పోరు
  • మీడియాలో చర్చా కార్యక్రమం
  • తనదైన శైలిలో జొన్నవిత్తుల వ్యాఖ్యలు
ఇటీవల మీడియాలో ఎక్కడ చూసినా రామ్ గోపాల్ వర్మ వర్సెస్ జొన్నవిత్తుల అంటూ చర్చా కార్యక్రమాలు దర్శనమిస్తున్నాయి. వర్మ ఇటీవలే జొన్నవిత్తులపై వ్యాఖ్యలు చేయగా, వాటికి అనేక వేదికల నుంచి జొన్నవిత్తుల సమాధానం చెబుతున్నారు. తాజాగా ఓ మీడియా చానల్ లో చర్చా కార్యక్రమానికి వచ్చిన జొన్నవిత్తుల తనదైన శైలిలో మాట్లాడారు.

వర్మ అభిమానులు ఎంతో అమాయకులు అని, వర్మ ఎన్ని తప్పులు చేసినా ఇష్టపడుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, వర్మ దేశభక్తి వద్దన్నాడని వాళ్లు మానుకోరు కదా, వర్మ తల్లి, భార్య ఎందుకు అన్నాడని వాళ్లు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండరు కదా అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై కోపం లేదని, తాను వర్మను బాగు చేయాలని భావిస్తున్నానని తెలిపారు.

"తాను చనిపోతే ఇంట్లో అందరూ ఆనందిస్తారని వర్మే అన్నాడు. కానీ అతను చనిపోయే లోపు అతడ్ని బాగు చేసి, అతడి తల్లికి ఓ మంచివాడ్ని అందించాలన్నది నా అభిమతం. అతడి విమర్శల్లోంచి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాను" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.
RGV
Jonnavithula
Tollywood

More Telugu News