రాజమౌళికి, కేఏ పాల్ కు ముడివేసిన వర్మ... నన్ను ఇన్వాల్వ్ చేయవద్దంటూ రాజమౌళి ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళికి, కేఏ పాల్ కు ముడివేసిన వర్మ... నన్ను ఇన్వాల్వ్ చేయవద్దంటూ రాజమౌళి ట్వీట్

  • ట్విట్టర్ లో వర్మ కలకలం
  • కేఏ పాల్ తో రాజమౌళి బాహుబలి-3 తీస్తున్నాడంటూ వ్యాఖ్యలు
  • వెంటనే స్పందించిన రాజమౌళి
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, అగ్రదర్శకుడు రాజమౌళి, కేఏ పాల్ లను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ప్రకంపనలు పుట్టిస్తోంది. "కేఏ పాల్ జీవితం మీద జోకర్ అనే బయోపిక్ తీస్తే బాహుబలి-3 కంటే పెద్ద హిట్టవుతుంది. రాజమౌళి ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో కేఏ పాల్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. కేఏ పాలే నాకీ విషయం చెప్పాడు" అంటూ వర్మ ఓ ట్వీట్ చేశాడు.

దీనికి దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, "నన్ను ఇందులోకి లాగకండి రాజు గారూ" అంటూ బదులిచ్చాడు. వెంటనే వర్మ అందుకుని, "సార్ నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కాదు, ట్రంప్ టవర్స్ లో మీరిద్దరూ లంచ్ చేశారట, బాహుబలి-3కి మీరు కేఏ పాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. కేఏ పాల్ మీద ఒట్టు! తనే నాకు ఫోన్ చేసి చెప్పాడు" అంటూ రిప్లయ్ ఇచ్చారు.
RGV
Rajamouli
KA Paul

More Telugu News