విశాఖలో రేపు జనసేన లాంగ్‌మార్చ్.. అనుమతినిచ్చిన పోలీసులు
- ట్విట్టర్‌లో వెల్లడించిన పవన్ కల్యాణ్
- ఇసుక సంక్షోభంపై ’ఛలో విశాఖపట్నం' కార్యక్రమం
- 2.5 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర
అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి విశాఖలో మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది కార్మికుల గొంతు వినిపిస్తామన్నారు. లాంగ్ మార్చ్ యథావిధిగా జరుగుతుందని, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.