'ఖైదీ' దర్శకుడితో 'విజిల్' హీరో విజయ్
- ఢిల్లీలో విజయ్ మూవీ షూటింగ్
- భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
- వచ్చే వేసవిలో విడుదల చేసే ఆలోచన
ఇటీవలే 'బిగిల్' సినిమాతో తన అభిమానులను అలరించిన విజయ్, తాజాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. తాజా షెడ్యూల్ ను ఈ రోజున ఢిల్లీలో మొదలుపెట్టారు. 40 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరించనున్నారు. సినిమాకి హైలైట్ గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, వచ్చే వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.