ఆలా ఎలా చెబుతారు? చిరంజీవి సలహాపై స్పందించిన కమలహాసన్!
- రాజకీయాల్లో విఫలమైన చిరంజీవి
- రాజకీయాలు వద్దని సూచించిన చిరంజీవి
- ఎవరి అనుభవాలు వారికే పాఠాలన్న కమల్
చిరంజీవి మాట్లాడిన మాటలను విన్న కమల్ తనదైన రీతిలో స్పందించారు. అందరి అనుభవాలూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి ఇచ్చిన సలహాను ఓ మీడియా సమావేశంలో గుర్తు చేసిన ఆయన, మరెవరైనా ఈ సలహా ఇవ్వవచ్చేమోగానీ, పొలిటీషియన్ గా పనిచేసిన చిరంజీవి ఈ మాటలెలా చెబుతారని ప్రశ్నించారు. ఎవరి అనుభవాలు వారికే పాఠాలు నేర్పుతాయని అన్నారు.