Raj Tharun: అందుకోసమే దిల్ రాజు ఆ నిర్ణయం తీసుకున్నాడట

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున డిస్ట్రిబ్యూటర్ గా .. మరో వైపున నిర్మాతగా 'దిల్' రాజు బిజీగా వున్నాడు. వరుస సినిమాలను నిర్మిస్తూ .. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఆయన నిర్మాతగా '96' రీమేక్ రూపొందుతోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 25వ తేదీన (బుధవారం) విడుదల చేయాలని ఆయన భావించాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆయన 'క్రిస్మస్'కి 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాను రంగంలోకి దింపడానికి సిద్ధమైనట్టుగా సమాచారం. రాజ్ తరుణ్ - షాలినీ పాండే జంటగా నటించిన ఈ సినిమాకి జీఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Go Back to Shorts
Raj Tharun
Shalini

More Telugu News