గుంటూరులో మంత్రి బొత్సకు చేదు అనుభవం.. నిలదీసిన భవన నిర్మాణ కార్మికులు
- ఇసుక కొరత వల్ల పనిదొరకడం లేదని ఆవేదన
- ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్న
- సర్ది చెప్పిన అమాత్యుడు
ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులను సముదాయించి బొత్స ముందుకు సాగారు. అనంతరం నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్లు, కాలువల నిర్మాణంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని, తమ ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని తెలిపారు.