'కార్తికేయ 2'కి రెడీ అవుతున్న నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కార్తికేయ 2'కి రెడీ అవుతున్న నిఖిల్

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సీక్వెల్ 
  •  వచ్చేనెలలో 'అర్జున్ సురవరం' విడుదల
చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఈ మధ్యనే చందు మొండేటి రంగంలోకి దిగాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

కొంతకాలంగా ఇటు చందు మొండేటికిగానీ .. అటు నిఖిల్ కి గాని హిట్ పడలేదు. దాంతో గతంలో తమ ఇద్దరికీ హిట్ ఇచ్చిన 'కార్తికేయ' కంటెంట్ తో మరోసారి విజయాన్ని అందుకోవాలనే ఆశతో వున్నారు. ఈ సీక్వెల్ తో వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ఇక కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నిఖిల్ సినిమా 'అర్జున్ సురవరం' వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Nikhil
Chandu

More Telugu News