అతి తక్కువ ఖర్చుతో స్పష్టంగా అంతరిక్ష చిత్రాలు.. భారత సంతతి పరిశోధకురాలి అరుదైన ఘనత
- ఇజ్రాయెల్‌లో పీహెచ్‌డీ చేస్తోన్న పరిశోధకురాలు
- వినూత్న టెలిస్కోపు వ్యవస్థ డిజైన్
- నానో ఉపగ్రహాలతో రూపకల్పన
సాధారణంగా అంతరిక్షంలో ఉండే వాటి ఫొటోలను స్పష్టంగా తీయలేము. ఇందుకోసం చాలా ఖరీదైన కెమెరాలతో తీయడానికి ప్రయత్నించినా అవి అంత స్పష్టంగా రావు. అంతేగాక, టెలిస్కోపులకు సంబంధించిన ఆప్టికల్ వ్యవస్థల అపెర్చర్ తీరుతెన్నులపై చాలా పరిమితులు ఉంటాయి. రోదసీ నుంచి తీసే చిత్రాల రిజల్యూషన్ పై ప్రభావం పడుతోంది. అంగికా బుల్బుల్ రూపొందించిన ఈ కెమెరాతో వీటన్నింటినీ అధిగమించొచ్చు.