రేపు ప్రగతి భవన్ ముట్టడి.. వ్యూహంపై చర్చించిన కాంగ్రెస్ నేతలు!
- షబ్బీర్ అలీ నివాసంలో నేతల భేటీ
- ఆర్టీసీ కార్మికుల సమ్మెపై దిగిరాని ప్రభుత్వం
- ప్రభుత్వంపై జేఏసీ, మద్దతుగా నిలిచిన పార్టీలు ఫైర్
ఈ క్రమంలో రేపు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో ముట్టడికి వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.