Balakrishna: చివరికి 'రూలర్' టైటిల్ నే ఖరారు చేసేశారన్న మాట!

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్ .. వేదిక కథానాయికలుగా అలరించనున్నారు. డిఫరెంట్ లుక్ తో బాలకృష్ణ కనిపించనున్న ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఇంతవరకూ ప్రకటించలేదు.

అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు, తాజాగా ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ టైటిల్ 'రూలర్' అనే సంగతిని చెప్పేశారు. టైటిల్ గురించిన అధికారిక ప్రకటన వెలువడకుండానే జెమినీ టీవీవారు ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం పట్ల బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. 
Go Back to Shorts
Balakrishna
Sonal
Vedika

More Telugu News