'రాజుగారి గది 3' కథ వింటూ చాలాసార్లు భయపడ్డాను: హీరోయిన్ అవికా గోర్
- ఆరంభంలోనే వరుస విజయాలు
- కొన్ని కారణాల వలన వచ్చిన గ్యాప్
- కొత్తదనం కోసం చేశానన్న అవికా
ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ .."నేను చేసిన పాత్రకి ముందుగా తమన్నాను అనుకున్నారు. ఆమె డేట్స్ కుదరకపోవడం వలన, కథ నా దగ్గరికి వచ్చింది. కథ వింటూ చాలాసార్లు భయపడ్డాను. చూసే వాళ్లకి కూడా అదే ఫీల్ కలుగుతుంది. ఈ కథను కాదని చెప్పడానికి కారణాలు కనిపించలేదు. కొత్త పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఓకే చెప్పాను. తప్పకుండా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది" అని చెప్పుకొచ్చింది.