జయలలితగారి దగ్గర చాలా చనువు ఉండేది: సీనియర్ నటి కుట్టి పద్మిని
- జయలలితగారి ఇంటికి దగ్గరలో ఉండేవాళ్లం
- ఆమెతో కలిసి 17 సినిమాల్లో నటించాను
- సెట్స్ లో ఆమె నగేశ్ తో ఎక్కువగా మాట్లాడేవారు
అప్పట్లో జయలలితగారి ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు ఉండేది. మా అమ్మగారికి జయలలితగారి అమ్మగారితో మంచి స్నేహం వుంది. అందువలన మంచి సంబంధాలు ఉండేవి. సెట్స్ లో జయలలితగారు ఎక్కువగా పుస్తకాలు చదువుకునేవారు. నేను వుంటే నాతోనే ఎక్కువగా మాట్లాడేవారు. లేదంటే నగేశ్ గారితో ఎక్కువగా మాట్లాడేవారు. జయలలితగారికి నవ్వడమంటే చాలా ఇష్టం. అందువలన నగేశ్ గారితో ఎక్కువ కబుర్లు చెప్పించుకునేవారు" అని అన్నారు.