డాక్టర్ రామినేని పురస్కారాలు అందుకున్న పీవీ సింధు, గోరటి వెంకన్న

  • నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో రామినేని ఫౌండేషన్ 20వ వార్షికోత్సవం
  • పురస్కారాలు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
  • 19 ఏళ్లుగా క్రమం తప్పకుండా పురస్కారాల ప్రకటన
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చంద్రశేఖర్, కూచిపూడి  కళాకేంద్రం వ్యవస్థాపకుడు కళారత్న బాలకొండలరావు, ప్రజాకవి గోరటి వెంకన్న తదితరులు డాక్టర్ రామినేని పురస్కారాలు-2019ను అందుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో గత రాత్రి నిర్వహించిన డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ (యూఎస్ఏ) 20వ వార్షికోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ పురస్కారాలను అందజేశారు.

19 సంవత్సరాలుగా రామినేని పురస్కారాలను అందజేస్తున్నట్టు ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మప్రచారక్‌ రామినేని, కన్వీనర్‌ గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎల్వీ ప్రసాద్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎన్‌ రావు, సీనియర్‌ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, ప్రముఖ హిప్నాటిస్ట్‌ బీవీ పట్టాభిరాంతో కూడిన ప్యానల్‌ కమిటీ అవార్డులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
PV Sindhu
gorati venkanna
doctor ramineni foundation

More Telugu News