మ్యాచ్ ను ఫ్రీగా చూడ్డానికి కాదు మీరు అక్కడున్నది: గవాస్కర్
- పూణే టెస్టు సందర్భంగా రోహిత్ కాళ్లపై పడ్డ అభిమాని
- పట్టుతప్పి కింద పడిపోయిన రోహిత్
- సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డ గవాస్కర్
స్టేడియంలోని సెక్యూరిటీ సిబ్బందిపై గవాస్కర్ మండిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షకులను గమనించడం మానేసి, మ్యాచ్ చూస్తున్నారని... అందుకే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. మన దేశంలో సంవత్సరాల నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. మ్యాచ్ ను ఫ్రీగా చూడటానికి కాదు సెక్యూరిటీ ఉన్నదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను నివారించడానికే సెక్యూరిటీ ఉందనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.