భారీగా పారితోషికం పెంచేసిన బాలకృష్ణ!
Add ap7am to your home Screen

భారీగా పారితోషికం పెంచేసిన బాలకృష్ణ!

  • షూటింగ్ దశలో బాలకృష్ణ మూవీ 
  • గతంలో నాలుగైదు కోట్లు మాత్రమే తీసుకున్న బాలకృష్ణ 
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన
మొదటి నుంచి కూడా బాలకృష్ణ చాలా వేగంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. 100వ సినిమా తరువాత కూడా ఆయన యువ హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా తన ప్రాజెక్టులను పట్టాలెక్కించే విషయంపైనే ఆయన ఎక్కువగా దృష్టిపెడతారు. పారితోషికం గురించి ఆయన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. అలాంటి బాలకృష్ణ తన తాజా చిత్రం కోసం పారితోషికం పెంచారనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

ప్రస్తుతం ఆయన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో .. సి.కల్యాణ్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకిగాను ఆయన 10 కోట్ల పారితోషికం అందుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు నాలుగైదు కోట్లు మాత్రమే తీసుకున్న బాలకృష్ణ, ఈ సినిమా కోసం ఈ స్థాయిలో పారితోషికం అడిగినా సి.కల్యాణ్ వెనకడుగు వేయలేదట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.
Balakrishna
Sonal Chauhan

More Telugu News