25 కిలోల బరువు తగ్గనున్న బాలకృష్ణ?
Add ap7am to your home Screen

25 కిలోల బరువు తగ్గనున్న బాలకృష్ణ?

  • కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 
  • తదుపరి సినిమా బోయపాటితో 
  • ప్రత్యేకమైన కసరత్తులు చేయనున్న బాలకృష్ణ  
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో పాత్ర కోసం బాలకృష్ణ కొంతవరకు బరువు తగ్గారు. ఆ తరువాత సినిమా కోసం మరింత బరువు తగ్గనున్నారనేది తాజా సమాచారం.

కేఎస్ రవికుమార్ తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం పాతిక కిలోల వరకూ బరువు తగ్గవలసి ఉంటుందని బోయపాటి చెప్పినట్టుగా సమాచారం. దాంతో ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే, కొన్ని రోజుల పాటు ప్రత్యేకమైన కసరత్తులు చేస్తూ .. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గాలనే ఆలోచనలో బాలకృష్ణ వున్నారని చెప్పుకుంటున్నారు.
Balakrishna

More Telugu News