ఒకే సినిమాలో 25 గెటప్పులతో కనిపించనున్న విక్రమ్
- సీనియర్ హీరోల్లో విక్రమ్ స్థానం ప్రత్యేకం
- అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కొత్త సినిమా
- రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్
ఇక ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్పులతో కనిపించనున్నాడని చెబుతున్నారు. తొలి షెడ్యూల్లోనే ఓ డిఫరెంట్ గెటప్పులో ఆయన షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు. ప్రపంచ సినీచరిత్రలో కథను బట్టి ఒకే సినిమాలో 25 గెటప్పులు వేసిన హీరోలు లేరట. అరుదైన ఆ రికార్డును దక్కించుకోవడం కోసమే విక్రమ్ రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.