బతుకమ్మను ఉద్యమరూపంగా మార్చిన ఘనత సోదరి కవితదే: కేటీఆర్ ప్రశంస
- నాటి సమైక్య పాలకులు తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారు
- బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతే
- వీడియో సందేశంలో అభినందనలు చెప్పిన కేటీఆర్
అప్పటి సమైక్య పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను ఆడకుండా అడ్డుకుని తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. అప్పుడు జాగృతి సంస్థ హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను ట్యాంక్‌బండ్‌పై సంబురంగా నిర్వహించిందని గుర్తు చేశారు. తన సోదరి కవితతోపాటు దశాబ్దకాలంగా జాగృతి సభ్యులు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.