ప్రభుత్వ లక్ష్యం మేరకు సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు
- పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలి
- ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం అపూర్వం: బొత్స
ఇదే సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం సాధారణ విషయం కాదని, ఉద్యోగాలు పొందిన వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు ఎంత బాధ్యతగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత పేరు వస్తుందని అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వహించినప్పటికీ విపక్షాలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.