ఆర్టీసీ బస్సును కారుతో ఢీకొట్టి.. ఆపై బస్సు డ్రైవర్‌పైనే యువకుల దాడి
- కరీంనగర్‌లో ఘటన
- రాంగ్ రూటులో వచ్చి ఆర్డీసీ బస్సును ఢీకొట్టిన యువకులు
- డ్రైవర్ ఫిర్యాదుతో యువకుల అరెస్ట్
కారును రాంగ్ రూటులో నడపడమే కాకుండా ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన అదిబ్ ఆగ్రహంతో కారు దిగి బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌తో గొడవకు దిగి దాడి చేశాడు. బస్సులోకి వెళ్లి డ్రైవర్‌ను కిందికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు, ప్రయాణికులు అతడిని అడ్డుకోవడంతో తోకముడిచాడు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదిబ్, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.