బీహార్ లో 'సాహో' రికార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ లో 'సాహో' రికార్డు

  • 'సాహో' హిందీ వెర్షన్ కి భారీ వసూళ్లు 
  • ప్రభాస్ మార్కెట్ స్థాయిని చాటిన 'సాహో'
  • బాలీవుడ్ హీరోలకి షాకిచ్చిన ప్రభాస్
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ 150 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం. ఇక బీహార్ లోను ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

బీహార్ రాష్ట్రంలో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో 'సాహో' 6వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గతంలో బీహార్లో సందడి చేసిన 'బజరంగీ భాయ్ జాన్' .. 'సుల్తాన్' .. అమీర్ ఖాన్ 'పీకే' .. రణవీర్ సింగ్ 'సింబా' చిత్రాల వసూళ్లను దాటుకుని 'సాహో' 6వ స్థానాన్ని దక్కించుకుంది. సినిమా టాక్ సంగతి ఎలా వున్నా, ప్రభాస్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందనేది 'సాహో' చాటిచెప్పింది.
Prabhas
Shraddha kapoor

More Telugu News