విజయ్ దేవరకొండకి మెసేజ్ పెడితే రెండేళ్లు ఆగాలన్నాడు: దర్శకుడు హరీశ్ శంకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ దేవరకొండకి మెసేజ్ పెడితే రెండేళ్లు ఆగాలన్నాడు: దర్శకుడు హరీశ్ శంకర్

  • హిట్ కొట్టిన 'గద్దలకొండ గణేశ్'
  • 'అర్జున్ రెడ్డి' తరువాత ఆ మెసేజ్ పెట్టాను 
  • నెక్స్ట్ మూవీలో ఎమోషన్ ఎక్కువ ఉంటుందన్న హరీశ్
హరీశ్ శంకర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గద్దలకొండ గణేశ్' తొలి రోజునే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాలలోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావించాడు.

"కొంతకాలం క్రితం .. అంటే 'అర్జున్ రెడ్డి' తరువాత, 'ఒకసారి కలుద్దామనుకుంటున్నాను విజయ్' అంటూ నేను విజయ్ దేవరకొండకి మెసేజ్ పెట్టాను. 'అన్నా .. రెండేళ్లవరకూ బిజీగా వున్నాను .. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం' అని తను మెసేజ్ పెట్టాడు. సినిమా టాపిక్ కాకుండా నీకు నాకు పనేముంటది భయ్యా .. రెండేళ్ల తరువాతే కలుద్దాములే అని నేను అన్నాను" అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సారి ఏ హీరోతో సినిమా చేసినా, ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నానని అన్నాడు.
Harish Shankar
Vijay Devarakonda

More Telugu News