బెంగళూరు టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి... సిరీస్ సమం చేసిన దక్షిణాఫ్రికా
- మూడో టి20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విక్టరీ
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యం ఛేదించిన దక్షిణాఫ్రికా
అనంతరం 135 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ డికాక్ ముందుండి నడిపించాడు. డికాక్ 52 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (28), టెంబా బవుమా (27 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. దాంతో 16.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 140 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య మాత్రమే వికెట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.