1965, 71 నాటి తప్పులు పునరావృతం చేశారంటే మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదు: పాకిస్థాన్ కు రాజ్ నాథ్ సింగ్ హెచ్చరిక
- పీఓకే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని పాక్ కు హితవు
- తప్పులు పునరావృతమైతే పాక్ రెండు ముక్కలవుతుందన్న రాజ్ నాథ్
- పాట్నాలో రాజ్ నాథ్ వ్యాఖ్యలు
"పీఓకే వెళ్లిన పాక్ ప్రధాని పొరబాటున కూడా ఇండో-పాక్ బోర్డర్ వద్దకు వెళ్లొద్దని అక్కడి వాళ్లకు చెప్పారు. ఆయనలా చెప్పడాన్ని నేను స్వాగతిస్తున్నా. ఒకవేళ ఎవరైనా సరిహద్దుల్లో అడుగుపెడితే మాత్రం పాకిస్థాన్ కు తిరిగి వెళ్లడమంటూ ఉండదు. పాక్ ఎగదోసిన ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టం. ఆర్టికల్ 370 రద్దుపై 67 శాతం కశ్మీర్ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఒకదేశంలో ఉగ్రవాదులు మరో దేశంలో సమరయోధులు ఎలా అవుతారు?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన జన్ జాగరణ్ సభలో రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.