ఆ రోజున అన్నపూర్ణ స్టూడియో నుంచి ఏడుస్తూ వెళ్లిపోయాను: దర్శకుడు హరీశ్ శంకర్
- మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం
- ఆ దర్శకుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు
- రెండేళ్ల కష్టం వృథా అయిందన్న హరీశ్
ఒక రోజున అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పత్రికల్లో నా పేరు చూసుకోబోతున్నాను అనే ఆత్రుతతో షూటింగ్ స్పాట్ కి వెళ్లాను. ముహూర్తం రోజున సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల పేర్లను మీడియాకి ఇస్తారు .. ఆ లిస్టులో నా పేరు లేదు. దర్శకుడిని ఆ విషయాన్ని గురించి అడిగితే ఏదో సమాధానం చెప్పాడు. రెండేళ్లు కష్టపడ్డాను .. రూపాయి కూడా ఇవ్వలేదు .. ఇప్పుడు పేరు కూడా వేయలేదు అనే ఆలోచన రాగానే ఏడుపొచ్చేసింది. అలా ఏడ్చుకుంటూనే అన్నపూర్ణ స్టూడియోలో నుంచి బయటికి వచ్చేశాను" అని చెప్పుకొచ్చాడు