'యమదొంగ'లో రబ్బరుగాజులు పాటను ముందుగా నేను పాడాను: సింగర్ విజయలక్ష్మి
- కీరవాణిగారు నాతో ఆ పాట పాడించారు
- దలేర్ మెహందీగారితో శ్రుతి కుదరలేదు
- ఆ సమయంలో విదేశాలకి బయలుదేరానన్న విజయలక్ష్మి
'యమదొంగ' సినిమాలో 'రబ్బరు గాజులు' పాటను కీరవాణిగారు ముందుగా నాతో పాడించారు. ఆ తరువాత దలేర్ మెహందీ పాడటానికి వచ్చారు. ఆయన పాడిన తరువాత ప్లే చేస్తే .. నా శ్రుతి చాలా తక్కువగా వుంది. మళ్లీ పాడితే మంచిదనే అభిప్రాయాన్ని దలేర్ మెహందీ వ్యక్తం చేశారు. కానీ నేను నెలా పదిహేను రోజుల పాటు సాగే స్టేజ్ షోల కోసం మణిశర్మగారి బృందంతో కలిసి విదేశాలకి వెళుతున్నాను. అప్పటికే సమయం అవుతుండటంతో, దలేర్ మెహందీతో కలిసి ఆ పాటను పాడలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.