కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు!
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో షాక్
- వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీ
- ప్రస్తుతం తీహార్ జైలులో వున్న చిదంబరం
యూపీఏ ప్రభుత్వంలో పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐ) వచ్చాయి. అయితే ఇందుకోసం భారీగా ముడుపులు చేతులు మారినట్లు గుర్తించిన సీబీఐ పలు సెక్షన్ల కింద చిదంబరంపై కేసు నమోదుచేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, తొలుత సీబీఐ కస్టడీకి అప్పగించిన కోర్టు.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.