Vijay: హీరో విజయ్ తో తలపడే విలన్ గా విజయ్ సేతుపతి

షార్ట్స్‌లో చూడండి
విజయ్ సేతుపతికి తమిళనాట విలక్షణ నటుడు అనే పేరు వుంది. పాత్రలో కొత్తదనానికి మాత్రమే ఆయన ప్రాధాన్యతనిస్తాడు. అందువల్లనే ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తుంటాడు. ఈ తరహా పాత్రల్లో ఇతర భాషా చిత్రాల్లో చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతుంటాడు.

తాజాగా ఆయన హీరో విజయ్ తో విలన్ గా తలపడటానికి సిద్ధమవుతున్నట్టుగా కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం విజయ్ అట్లీ కుమార్ తో 'బిగిల్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తన 64వ సినిమాను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రను విజయ్ సేతుపతి చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయననే ఖరారు చేశారనే టాక్ ఇప్పుడు కోలీవుడ్లో వినిపిస్తోంది.
Go Back to Shorts
Vijay
Vijay Sethupathi

More Telugu News