'రామాయణ'లో రావణుడిగా ప్రభాస్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రామాయణ'లో రావణుడిగా ప్రభాస్?

  • భారీ పౌరాణిక చిత్రంగా 'రామాయణ'
  • రాముడిగా హృతిక్ .. సీతగా దీపిక
  • మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు 
తెలుగు సినిమా ప్రపంచపటంపై జయ కేతనాన్ని ఎగరేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఒక వైపున దగ్గుబాటి సురేశ్ బాబు 'హిరణ్య కశిప' వంటి పౌరాణిక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపున 'రామాయణ' సినిమా చేయడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. మధు మంతెన - నమిత మల్హోత్ర కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కానున్నారు.

మూడు భాగాలుగా రూపొందే ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్ ను .. సీతాదేవిగా దీపికా పదుకొనేను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. రావణుడి పాత్ర కోసం కొంతకాలంగా అన్వేషణ జరుగుతోంది. 'సాహో' సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ప్రభాస్ కి గల క్రేజ్ ను మరోమారు నిరూపించింది. దాంతో 'రామాయణ'లో రావణుడి పాత్ర కోసం ప్రభాస్ ను సంప్రదించే ఆలోచనలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Prabhas
Hrithik
Deepika

More Telugu News