గోదావరి బోటు ప్రమాదం.. మరో మృతదేహం లభ్యం
- కాఫర్ డ్యామ్ వద్ద మరో మృతదేహం గుర్తింపు
- తీసుకొచ్చేందుకు బయలుదేరిన సిబ్బంది
- ప్రారంభమైన సహాయక చర్యలు
నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు వచ్చిన నేవీ హెలికాప్టర్ వెనుదిరిగింది. అయితే, బోటు మాత్రం 300 అడుగుల లోతున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో కొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్న అధికారులు.. నేడు దానిని ఎలాగైనా బయటకు తీయాలని యోచిస్తున్నారు.