ఎన్టీఆర్ తో తప్పకుండా హిట్ మూవీ తీస్తాను: దర్శకుడు హరీశ్ శంకర్
- ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం
- ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను
- ఎన్టీఆర్ రుణం తీర్చుకుంటాను
"నేను ఎంతగానో అభిమానించే యువ కథానాయకులలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకి నేను చాలా రుణపడి వున్నాను. 'రామయ్య వస్తావయ్యా' సినిమాతో ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అప్పటి నుంచి నాలో ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఎప్పటికైనా ఆయనతో మరో సినిమా చేయాలి .. హిట్ ఇచ్చేసి రుణం తీర్చుకోవాలి. ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.