భారత్-దక్షిణాఫ్రికా తొలి టి20 మ్యాచ్ వర్షార్పణం

  • ధర్మశాలలో ఎడతెరిపిలేని వర్షం
  • ఫలించని మైదాన సిబ్బంది ప్రయత్నాలు
  • మ్యాచ్ రద్దు చేసిన అంపైర్లు
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ పోరుకు వేదికైన ధర్మశాలలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో మైదానం నిండుకుండలా మారింది. నీటిని తొలగించేందుకు మైదానం సిబ్బంది ఎంత శ్రమించినా, వర్షం పడుతూనే ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టి20 ఈ నెల 18న చండీగఢ్ లో జరగనుంది.
Go Back to Shorts
India
South Africa
T20

More Telugu News