కాంగ్రెస్ నేత చిదంబరానికి మళ్లీ షాక్.. సరెండర్ పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు!
- ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిద్దూ
- ఈడీకి సరెండర్ అవుతానంటూ పిటిషన్
- ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం
చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియాకు రూ.305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా చిదంబరం నిబంధనలను ఉల్లంఘించి మరీ అనుమతులు ఇప్పించారనీ, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నారని సీబీఐ కేసు నమోదుచేసింది. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఈడీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఆయనకు జ్యూడీషియల్ కస్టడి విధించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.