రూ. 17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ... దక్కించుకున్న కొలన్ రామిరెడ్డి!

  • ఉత్సాహంగా సాగిన వేలం పాట
  • మరోమారు దక్కించుకున్న కొలన్ ఫ్యామిలీ
  • రెండు కిలోల వెండి పళ్లెంలో లడ్డు
గణేశ్ భక్తులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే హైదరాబాద్, బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డూను కొలన్ రామిరెడ్డి రూ. 17.60 లక్షలకు దక్కించుకున్నారు. గత సంవత్సరం లడ్డూ ధర రూ. 16.60 లక్షలకు పోగా, ఈ సంవత్సరం లడ్డూ ధర దాన్ని మించింది.

రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు కొలన్ రామిరెడ్డికి అందించారు. కాగా, కొలన్ ఫ్యామిలీ సభ్యులు గతంలో పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారు.
Go Back to Shorts
Hyderabad
Balapur
Ladoo
Kolan Ramireddy

More Telugu News