వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు
- మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదు
- వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్
- నేడు వేంపల్లి, పులివెందుల పోలీసుల విచారణకు హాజరుకానున్న అంబటి
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు రిజిస్టర్ చేశారు. టీడీపీ నేత రామమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అంబటి రాంబాబుపై ఐపీసీ సెక్షన్లు 352, 353, 196(1) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఏప్రిల్ 30వ తేదీ ఉదయం వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని అంబటి రాంబాబును ఆదేశించారు.
ఇదే రోజు మధ్యాహ్నం ఆయన పులివెందుల పోలీసుల విచారణకు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, అంబటి రాంబాబుపై పులివెందులలో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.