YSRCP: ఏమీ చెయ్యని సీఎం జగన్ నిద్రలేవాలి.. కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు అవకాశమివ్వాలి: బండ్ల గణేశ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార, ప్రతిపక్షపార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిందని, ఆంధ్రా మరో బీహార్ లా తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని మండిపడ్డారు. కలిసికట్టుగా పని చేస్తే రాష్ట్రానికి మంచిదని అధికార, ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.

ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ఆయన విమర్శలు చేశారు. వందరోజుల పాలనలో ఏమీ చెయ్యని సీఎం జగన్ నిద్రలేవాలి, ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని, జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని సూచించారు. ‘దగాపడ్డ తెలుగు ప్రజలారా!  ఏ నాయకుడినీ నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను, మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలని. భావితరాలకు ఆయనే (భగవంతుడే) దిక్కు’ అని వ్యాఖ్యనించారు.
Go Back to Shorts
YSRCP
Jagan
cm
Telugudesam
Chandrababu

More Telugu News