ఆదిలాబాద్ ఎంపీ గృహ నిర్బంధానికి నిరసనగా.. నేడు ఆదివాసీల బంద్
Add ap7am to your home Screen

ఆదిలాబాద్ ఎంపీ గృహ నిర్బంధానికి నిరసనగా.. నేడు ఆదివాసీల బంద్

  • సదస్సుకు రానీయకుండా ఆదిలాబాద్ ఎంపీ గృహనిర్బంధం
  • ఓయూలో రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం
  • లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్
తమ సదస్సుకు రానీయకుండా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావును గృహ నిర్బంధం చేసినందుకు నిరసనగా ఆదివాసీలు నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఓ దూరవిద్య కేంద్రంలో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. ఆదివాసీలకు సమాజంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. లంబాడీలను తక్షణమే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయంపై పోరాటాన్ని ఉద్ధృతం చేయనున్నట్టు హెచ్చరించారు. కార్యక్రమంలో  ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొంది వెంకటరమణ, ఉపాధ్యక్షుడు అనకా దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
Telangana
lambada
agency
bandh

More Telugu News